Monday, January 3, 2011

హిస్టరీ




దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్
 
, కర్నాటక,తమిళనాడు,కేరళ రాష్త్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరి సముదాయం కూడా ఉంది.భారత ద్విపకల్పంలో వింధ్వ పర్వతాలకు దక్షిణాన ఉన్న ప్రాంతమంతా దక్షిణ భారతదేశం.ఉత్తరాన నర్మద,ఇతర మహానదులు,పదమట అరేబియా మహాసముద్రం,దక్షిణాన హిందూ మహాసముద్రం,తూర్పున బంగాళఖాతం ఉన్నాయి.దక్షిణ భారతదేశానికి సరిహద్దుగా కన్యాకుమరి ఉండి,ఇరువైపులా ఉన్న తూర్పు కనుమలు,మధ్య ప్రాంతంలో దక్కన్ పీఠభూములతో భౌగోళికంగా కూడా దక్షిణ భారతదేశంలో వైవిధ్యం ఉంది. దక్షిణ భారతీయులు ముఖ్యంగా ద్రావిడ భాషలు మాట్లాడతారు.దక్షిణ భరతదేశాన్ని ఎందరో రాజులు పాలించారు.అందులో ముఖ్యులు శాతవాహనులు,ఆంధ్ర ఇక్ష్వాకులు,చోళులు,పాండ్యులు,చేరులు,చాళుక్యులు,రాష్ట్ర కూటులు,హొయసలులు,విజయనగరం రాజులు....మొదలైనవారు.ఇక్కడ వ్యవసాయం ప్రధాన వ్రుత్తి.మొత్తం స్థూల ఉత్పత్తిలో వ్యవసాయానిదే అగ్రస్థానం. సాఫ్ట్ వేర్(software)రంగం ఇక్కడ చాలా వేగంగా విస్తరిస్తోంది.దేశంలో .చలనచిత్ర రంగం కూడా అనేక ప్రత్యేకతలతో ప్రపంచంలోని వివిధదేశాల ప్రజల్ని అలరిస్తోంది. దక్షిణ భారతదేశంలోని ప్రజలు మిగిలిన ప్రాంత ప్రజల కన్నా విద్యారంగంలో ముందుండటమే కాక అత్యధిక తలసరి ఆదాయం కలిగి ఉన్నరు. ఇక్కడ వ్యవసాయరంగం,విద్యారంగం రెండు వేల సంవత్సరాలుగా తమ ప్రత్యేకతను చూపుతున్నారు.

సాఫ్ట్ వేర్ ఉత్పత్తుల్లో ఎక్కవ భాగం దక్షిణ భారతదేశం నుంచే ఉత్పత్తి అవుతున్నది

No comments:

Post a Comment